కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం

17 Apr, 2020 12:28 IST|Sakshi

ఉద్యోగాల కోతా వుండదు, జీతాల పెంపూ  ఉండదు

ఉద్యోగ భద్రత, కానీ జీతాలపై ఉసూరుమనిపించిన టీసీఎస్

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ క్యూ4 ఫలితాల సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 4.5 లక్షల తమ ఉద్యోగుల్లో ఎవర్నీ తీసివేయడం లేదని వెల్లడించింది. అయితే  జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ సంస్థ తెలిపింది.  అయితే కొత్త నియామకాలపై  ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది. ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40వేల మంది నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత)

మార్చి త్రైమాసికంలో  టీసీఎస్ ఆరోగ్యకరమైన లాభాలను నివేదించింది. క్యూ 4లో  నికర లాభం 0.8 శాతం తగ్గి  రూ .8,049 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రతి  షేరుకు రూ .6  తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. మార్చి క్వార్టర్‌ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి, కొన్ని భారీ డీల్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఆదాయ క్షీణించే అవకాశం ఉందని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కంపెనీ పట్ల ఉద్యోగులు చూపించిన నిబద్ధతను గోపీనాథన్ ప్రశంసించారు. ప్రస్తుతం భారతదేశంలో 355,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో 90 శాతం మంది ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి సురక్షితమైన కార్యాలయాలతో అనుసంధానించబడ్డారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. మెరుగైన ఫలితాలతో  శుక్రవారం నాటి మార్కెట్లో టీసీఎస్  షేరు టాప్ గెయినర్ గా వుంది.  (7.4 శాతం వృద్ధిని సాధిస్తాం)

 చదవండి : రూపాయికి ఆర్‌బీఐ 'శక్తి' 


 

మరిన్ని వార్తలు