కరోనాపై పోరు : ఏడీబీ భారీ సాయం

29 Apr, 2020 11:12 IST|Sakshi

 పేద ప్రజల సహాయార్థం 1.5 బిలియన్ డాలర్ల రుణం -ఏడీబీ

సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందించేందుకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ముందుకొచ్చింది. భారతదేశానికి 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,000 కోట్లు) రుణాన్ని అందించేందుకు ఆమోదం తెలిపింది.  కోవిడ్-19 కట్టడి, నివారణ చర్యలు, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహణ లాంటి తక్షణ ప్రాధాన్యతా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చుపెట్టనుంది.


ఏడీబీ ప్రెసిడెంట్  మసాట్సుగు అసకావా (ఫైల్ ఫోటో)

భారతదేశానికి 150 కోట్ల డాలర్ల రుణం (రూ. 11,000 కోట్లు) ఇవ్వడానికి ఏడీబీ మంగళవారం అంగీకరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ -19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రాం  పేదలు, మహిళలు , ఆర్థికంగా బలహీన వర్గాలకు సామాజిక రక్షణతో పాటు, వ్యాధి నివారణ చర్యలకు మద్దతుగా ఈ నిధులను సమకూర్చనున్నామని ఏడీబీ అధ్యక్షుడు మసాట్సుగు అసకావా ఒక ప్రకటనలో తెలిపారు. 2020 మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వం అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాలను సక్రమంగా అమలులో ఏడీబీ అందించిన ఆర్థిక సాంకేతిక సహకారం దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిసమీర్ కుమార్ ఖరే చెప్పారు. దీంతోపాటు వృద్ధిని పెంచడానికి, బలమైన పునరుద్ధరణకు సాధ్యమైన మద్దతు అందించేందుకు ఏడీబీ  ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. క్రెడిట్ గ్యారెంటీ పథకాల ద్వారా ఆర్థిక సదుపాయాన్ని సులభతరం చేయడం తద్వారా ప్రభావిత పరిశ్రమలు వ్యవస్థాపకులకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది.  (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ)

 
 

మరిన్ని వార్తలు