కరోనా వ్యాప్తి: భారీగా వాల్‌మార్ట్‌ నియామకాలు

20 Mar, 2020 13:05 IST|Sakshi

బెంగళూరు: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రిటైల్‌ దుకాణాలలో పనిచేసేందుకు లక్షమందికి పైగా కార్మికులను నియమిస్తామని రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ తెలిపింది. కొత్తగా నియమించే ఉద్యోగులకు కంపెనీ వరాల జల్లు ప్రకటించింది. పూర్తి సమయం పనిచేసే కార్మికులకు 300 డాలర్లు, తాత్కాలికంగా పనిచేసే కార్మికులకు 150 డాలర్ల బోనస్‌ ప్రకటించాలని కంపెనీ భావిస్తోంది. కార్మికల నియామకాలను మే చివరి నాటికి పూర్తి చేస్తామని వాల్‌మార్ట్‌ పేర్కొంది.

కొత్తగా విధుల్లో చేరిన కార్మికులు రిటైల్‌ స్టోర్స్‌, క్లబ్స్‌, పంపిణీ కేంద్రాల్లో విధులను నిర్వర్తిస్తారని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించే విధంగా ఈ నియామకాలను చేపడతామని కంపెనీ సీఈఓ డగ్‌ మెక్‌మిలన్‌ పేర్కొన్నారు. ఆహార, పరిశుభ్రతను పాటించడంలో భాగంగా అదనపు సిబ్బందిని నియమిస్తున్నామని వాల్‌మార్ట్‌ వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు