కార్పొరేట్ మొబైల్ బ్యాంకింగ్ జోరు: హెచ్‌ఎస్‌బీసీ

22 Jun, 2015 01:18 IST|Sakshi
కార్పొరేట్ మొబైల్ బ్యాంకింగ్ జోరు: హెచ్‌ఎస్‌బీసీ

న్యూఢిల్లీ : కార్పొరేటర్ల మొబైల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫామ్ వినియోగంలో గణనీయమైన వృద్ధి నమోదౌతోందని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. వచ్చే 18 నెలలో మొబైల్ బ్యాకింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా జరిగే గ్లోబల్ పేమెంట్స్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. డ్రాఫ్ట్స్, చెక్స్ వంటి సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ట్రెజరర్స్ వంటి కార్పొరేటర్లు వారి ఆర్థిక లావాదేవీలకు మొబైల్ బ్యాంకింగ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని పేర్కొంది.

అకౌంట్ బ్యాలెన్స్‌ను చూసుకోవడానికి, పేమెంట్ అలర్ట్స్ తదితర వాటికి మొబైల్ బ్యాంకింగ్ అనువుగా ఉంటుందని అభిప్రాయపడింది. అలాగే ఇంటర్నేషనల్ లావాదేవీలను మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా నిర్వహించవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు