లాక్‌డౌన్‌ను విశ్లేషించిన సర్వే

21 May, 2020 20:12 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్త ఆర్థిక వ్యవస్థను విశ్లేషించేందుకు స్క్ర్రిప్‌బాక్స్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కార్పొరేట్‌ ఆదాయాలు 25శాతం తగ్గినట్లు సర్వే వెల్లడించింది. ఈ సర్వేలొ 65శాతం కంపెనీ యజమాన్యాలు కార్పొరేట్‌ ఆదాయాలు 25శాతం తగ్గినట్లు అభిప్రాయపడగా.. మరో 22శాతం కంపెనీల పెద్దలు ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ఏడాది పడుతుందని విశ్లేషించారు.

ఈ సర్వే మే1నుంచి 15 వరకు 1200కంపెనీ ముఖ్యులు సర్వేలో పాల్గొన్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. సర్వేలో పాల్గొన్న 90శాతం వ్యక్తులు 25శాతం ఉద్యోగాల కోత ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సూక్ష్మ మద్య స్థాయి పరిశ్రమలు మూతపడడం వల్ల ఉద్యోగాల కోత భారీగా ఉండొచ్చని సర్వే పేర్కొంది. వినియోగదారులు స్వల్పకాలిక లాభాలను ఆశించే కంటే దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాముఖ్యత ఇవ్వాలని సర్వే సీఈవో అతుల్ సింగాల్‌ సూచించారు.

మరిన్ని వార్తలు