క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి

12 Dec, 2016 15:05 IST|Sakshi
క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి

వారానికి రూ.50,000 చాలా చిన్న మొత్తం
దీని వల్ల పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొంటున్నారుు
ప్రభుత్వానికి అసోచామ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: క్యాష్ విత్‌డ్రాయల్స్‌పై పరిమితిని తొలగించాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ తాజాగా కేంద్రానికి విన్నవించింది. రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా అనే నిబంధన వల్ల పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఈ లిమిట్ చాలా స్వల్పమని, దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపింది. ‘కరెంట్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా పరిమితి వల్ల పరిశ్రమలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారుు. సంస్థలకు ఈ మొత్తం చాలా చిన్నది. అందుకే పరిమితిని పెంచాలి. పరిశ్రమలకు ఇలాంటి పరిమితులతో అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిర్వహించే లావాదేవీలన్నీ నమోదు అవుతారుు. వీటిని ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది’ అని వివరిస్తూ అసోచామ్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది.

రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని కోరింది. ఫైనాన్‌‌స కోసం బ్యాంకులు/ఆర్థిక సంస్థలపై ఆధారపడ్డ కంపెనీలపై పరిమిత సంఖ్యలో నగదు లభ్యత అనే అంశం తీవ్ర ప్రభావం చూపతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణగ్రహితలు మరీ ప్రత్యేకించి ప్రైవేట్ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈ రంగ సంస్థలు వాటి రుణం/వడ్డీ చెల్లింపులల్లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. అందుకే పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని సూచించింది.

 క్యాష్ కార్డులను జారీ చేయండి
నగదు లభ్యత తక్కువగా ఉన్న తాజా పరిస్థితుల్లో రిటైల్ కస్టమర్లకు, చిన్న వర్తకులకు క్యాష్ కార్డులను జారీ చేయాలని తెలిపింది. దీని వల్ల బ్యాంక్ ఖాతా లేకున్నా లావాదేవీలను నిర్వహించవచ్చని పేర్కొంది. దేశంలో నగదు పంపిణీ (క్యాష్ డిస్ట్రిబ్యూషన్) వేగంగా చేయాల్సి ఉందని, దీని వల్ల వ్యవస్థలో సరిపడ నగదు ఉందనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతుందని తెలిపింది.

మరిన్ని వార్తలు