కార్పొరేషన్ బ్యాంక్‌లో కార్ప్‌పేరోల్ ఖాతాలు

21 Nov, 2015 01:03 IST|Sakshi

బ్యాంక్ సీఎండీ బన్సాల్ వెల్లడి
* ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల కోసం..
విజయవాడ: కార్పొరేషన్ బ్యాంక్‌లో కొత్తగా కార్ప్‌పేరోల్ ఖాతాలను ప్రారంభించినట్లు ఆ బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఆర్. బన్సాల్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో రాష్టస్థాయి బ్యాంకు అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  కార్ప్‌పేరోల్ ఖాతాలను ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టామన్నారు. కార్ప్‌పేఎలైట్‌ను రూ. 15వేల నుంచి రూ.75 వేల లోపు జీతం పొందేవారికి, కార్ప్‌పేడిలైట్‌ను రూ.75 వేలు, ఆపై జీతం పొందేవారి కోసం ప్రారంభించామన్నారు.

కార్ప్‌పేఎలైట్ ఉద్యోగులు వీసా ప్లాటినం డెబిట్ కార్డుకు అర్హులని ఆయన వివరించారు. ఈ కార్డు వల్ల రోజుకు రూ.1 లక్ష వంతున విత్‌డ్రాలో ఏటీఎం నుంచి పొందవచ్చన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, నెల్లూరులో రెండు జోన్లు ఉండగా, వచ్చే మార్చికల్లా వైజాగ్‌లో కొత్త జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోవిజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ-లాబీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ-లాబీ కేంద్రంలో కేవలం యంత్రాల ద్వారా ఖాతాదారులు  లావాదేవీలన్నీ జరుపుకొనే వీలుంటుందన్నారు. మీడియా సమావేశంలో కార్పొరేషన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ముజ్ మదార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.శివకుమార్ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు