కార్పొరేషన్ బ్యాంక్ నష్టం రూ.519 కోట్లు

19 May, 2016 02:00 IST|Sakshi
కార్పొరేషన్ బ్యాంక్ నష్టం రూ.519 కోట్లు

మొండి బకాయిల కేటాయింపుల ప్రభావం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కార్పొరేషన్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.510 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ స్థాయి నష్టాలు వచ్చాయని కార్పొరేషన్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.45 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.926 కోట్లుగా ఉన్న మొండి బకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రెట్టింపై రూ.1,960 కోట్లకు చేరాయని వివరించింది.

మొత్తం ఆదాయం రూ.5,385 కోట్ల నుంచి రూ.5,219 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 4.81 శాతం నుంచి 9.98, అలాగే నికర మొండి బకాయిలు 3.08 శాతం నుంచి 6.35 శాతానికి పెరిగాయని పేర్కొంది.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కార్పొరేషన్ బ్యాంక్ షేర్ 1.47 శాతం లాభపడి రూ.38 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు