కరోనా‌: జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ సందేశం విన్నారా?

7 Mar, 2020 13:39 IST|Sakshi

కరోనా వైరస్‌పై అవగాహన

బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో కనెక్షన్లలో ప్రీ కాలర్‌ ట్యూన్‌

సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు వ్యాపించిన కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) వ్యాప్తిని చెందిన నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలు కీలక ప్రచారాన్ని చేపట్టాయి.  మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కాల్‌ చేసిననపుడు ఒక అవగాహనా సందేశాన్ని ప్లే చేస్తోంది. కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నివారణకు అనుసరించాల్సిన ముందు  జాగ్రత్త చర్యలతో ఈ సందేశం నిండి వుండటం విశేషం.  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌,  రిలయన్స్‌ జియో వినియోగదారులకు ఫోన్‌ చేసినపుడు  ఈ సందేశాన్ని వినియోగదారులు గమనించవచ్చు. 

కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ  చేపట్టిన అవగాహనా చర్యల్లో భాగంగా ప్రీ కాలర్ ట్యూన్ అవగాహనా సందేశం జియో,  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్ కనెక్షన్లలో శనివారం ప్రారంభమైంది. దగ్గు శబ్దంతో సందేశం ప్రారంభమవుతుంది. "మీరు నవల కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. దగ్గినపుడు లేదా తుమ్ముతున్నప్పుడు మీ ముఖాన్ని చేతిరుమాలు అడ్డుపెట్టుకోండి. సబ్బుతో చేతులను నిరంతరం శుభ్రం చేసుకోండి" అనే సందేశం హిందీ, ఆంగ్లంలో ప్లే అవుతుంది. "ముఖం, కళ్ళు లేదా ముక్కును తాకకండి. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి కష‍్టంగా వుంటే వారినుంచి కనీసం ఒక మీటర్‌ దూరంలో వుండండి. అవసరమైతే, వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి" అనే సందేశాన్ని ఇస్తోంది. కాగా గత ఏడాది సెప్టెంబరులో చైనా వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి సోకింది. 3 వేలమంది మరణించారు.  మన దేశంలో  ఈ వైరస్‌  సోకిన వారి సంఖ్య ఇప్పటికే 33కి చేరింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా