ఇక ఆ ఉత్పత్తులు జీఎస్టీలోకి..

14 Dec, 2017 17:30 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశమంతా ఏక పన్ను విధానం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఈ పన్ను విధానంలోకి మరికొన్ని ఉత్పత్తులను తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్‌ చూస్తోంది. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, రియాల్టీని తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తోందని బిహార్‌ ఆర్థిక మంత్రి సుశిల్‌ మోదీ చెప్పారు. ఎలక్ట్రిసిటీ, రియల్‌ ఎస్టేట్‌, స్టాంప్‌ డ్యూటీ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావాలనుకుంటున్నామని ఇండస్ట్రి ఛాంబర్‌ ఫిక్కీ వార్షిక సమావేశంలో ఆయన తెలిపారు. అయితే ఏ సమయం వరకు వీటిని జీఎస్టీలోకి తీసుకొస్తామో చెప్పడం కష్టమన్నారు. చట్టాన్ని సవరణ చేయకుండానే వీటిని కలుపబోతున్నట్టు పేర్కొన్నారు.

ఒకవేళ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పాలనలోకి తీసుకొస్తే, ఇవి అత్యధిక మొత్తంలో పన్ను శ్లాబులోకి వచ్చే అవకాశముంటుంది. అదేవిధంగా రాష్ట్రాలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి సెస్‌ను విధించబోతున్నారు.  ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం రెవెన్యూలను పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ఆర్జిస్తున్నాయి. జీఎస్టీ పన్ను విధానంలో ఐదు పన్ను శ్లాబులు 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా జీఎస్టీ సెస్‌ విధిస్తున్నారు. వీటిలో అ‍త్యధిక పన్ను శ్లాబుగా ఉన్న 28 శాతాన్ని 25 శాతానికి తగ్గించబోతున్నారు. లేదా 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను ఒకటిగా కలుపబోతున్నారు.   

మరిన్ని వార్తలు