వ్యవస్థల కంటే దేశమే ముఖ్యం 

23 Feb, 2019 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: లిక్విడిటీ పెంచడం, వడ్డీ రేట్లు సహా ప్రభుత్వం నుంచి ఆర్‌బీఐకి పలు డిమాండ్లు చేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. వ్యవస్థల కంటే దేశమే ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు.

రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఎన్నిక కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అప్పుడే ఆర్థిక రంగానికి స్థిరత్వం ఏర్పడుతుందని, రక్షకుడిని మార్చాల్సిన అవసరం రాదన్నారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు లేదా ఎన్నికల తర్వాత ప్రకటనలు చేయడం వేర్వేరని, దీర్ఘకాలిక విధానాలపై దృష్టి  పెట్టాలని అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు