బిగ్‌ బుల్‌కు షాక్‌: జైలు శిక్ష, జరిమానా

28 Feb, 2018 10:42 IST|Sakshi
సెబీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై:  మాజీ స్టాక్ బ్రోకర్లు కేతన్ పరేఖ్‌, కార్తీక్‌ పరేఖ్‌లకు సెబీ ప్రత్యేక  కోర్టు  జైలు శిక్ష విధించింది. స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో భారీ అక్రమ లావాదేవీలు లాంటి పలు కేసుల్లో నేరస్తుడిగా తేలిన  పరేఖ్‌బ్రదర్స్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు  సెబీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా  ప్రకటించింది.

కేతన్‌, కార్తీక్‌ డైరెక్టర్లుగా ఉన్న పాంథర్‌ ఫిన్‌కార్ప్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సెబీ నిబంధనలను వ్యతిరేకంగా షాంక్‌ టెక్నాలజీస్‌ ఇంటర్నేషనల్‌​ లిమిటెడ్‌ నుంచి  పరిమితికి మించి షేర్లను అక్రమంగా కొనుగోలు చేసింది. ఈ ఉల్లంఘనల పై విచారణను 2003 లో పూర్తి చేసిన సెబీ  రూ.6.5 లక్షల జరిమానా విధించింది. దీనిపై నిందితులు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ (సాట్‌)ను ఆశ్రయించారు. అయితే దీన్ని(2007) తోసి పుచ్చడంతో పాటు 45రోజులలోపు ఈ జరిమానాను చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే సాట్‌ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్‌ చేయక పోవడంతో ఈ కేసు ముగిసిందని సెబీ కోర్టు ప్రకటించింది.  అలాగే జరిమానాను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని సెబీని పరేఖ్‌ బ్రదర్స్‌కు వేడుకున్నారు. ఇది సెబీ నిబంధనలకు  విరుద్ధమంటూ ఈ ప్రతిపాదను తోసి పుచ్చింది.  పెనాల్టీని చెల్లించకపోవడంతో  తదుపరి చర్యలకు  సెబీ ఉపక్రమించింది.  పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ   బేఖాతరు చేయడంతో  కోర్టుముందు హాజరుకావల్సిందిగా కఠిన ఆదేశాలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలోనే గత నవంబరులో కోర్టుకు హాజరైన కేతన్‌ పరేఖ్‌ను కస్టడీకి తరిలించగా అప్పటినుంచి జైల్లోనే  ఉన్నాడు.  దీనిపై విచారించిన సెబీ ప్రత్యేక కోర్టు తాజా తీర్పునిచ్చింది.

>
మరిన్ని వార్తలు