కరోనా వ్యాక్సిన్‌తో ఫార్మా రంగం వృద్ధి : మూడీస్‌ నివేదిక

10 Jul, 2020 19:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో మెజారిటీ రంగాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ ఫార్మా రంగం మాత్రం ఆశాజనక వృద్ధితో దూసుకెళ్తుందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తెలిపింది. కరోనా వైరస్‌ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ల(టీకా)ను కనిపెట్టే ప్రయత్నంలో చాలా బిజీగా రీసెర్చ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఫార్మా రంగం ఆర్థికంగా లాభాలు తేకపోవచ్చు గానీ, ఫార్మా పరిశ్రమ పుంజుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ త్వరగా అందుబాటులోకి వస్తే ఫార్మా రంగం వేగంగా పుంజుకుంటుందని నివేదిక తెలిపింది.

ఫార్మా రంగం అభివృద్ధి చెందితే ప్రజలకు మెరుగైన సేవలందుతాయని పేర్కొంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకొచ్చేందుకు దేశానికి చెందిన భారత్‌ బయోటెక్‌, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాలు ముందంజలో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం, ఐసీఎమ్‌ఆర్‌ సహాయంతో భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన కొవాక్సిన్‌ మొదటగా మార్కెట్‌లో లభ్యమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు