ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

7 Aug, 2019 11:34 IST|Sakshi

న్యూయార్క్‌: ఐఫోన్‌ యూజర్లు ‘ఆపిల్‌ కార్డ్‌’ సేవలను ఈ మంగళవారం నుంచి వినియోగించుకోవచ్చని టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ప్రకటించింది. వాలెట్‌ యాప్‌ నుంచి క్రెడిట్‌ కార్డ్‌ కావాలని దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ భాగస్వామ్యంతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ.. ఆపిల్‌ బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ సేవలను తొలుత అమెరికాలో ప్రారంభించనున్నట్లు వివరించింది. వీలైనన్ని సైన్‌–అప్స్‌ను పెంచడం ద్వారా కార్డు సేవలను విస్తరించాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపింది.

సాధ్యమైనంత వరకు ఫీజుల భారాన్ని తగ్గించివేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆపిల్‌ పే యాప్‌లో అభివృద్ధిచేసిన డిజిటల్‌ క్రెడిట్‌ కార్డు వినియోగంపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. కార్డు ఆధారంగా సునాయాసంగా డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వీలు ఉందని, యూజర్లు ఫిజికల్‌ కార్డు కావాలని కోరితే కొంత రుసుము వసూలుచేసి కార్డును ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. వెబ్‌సైట్‌ ఆప్షన్‌ లేదని స్పష్టంచేసింది. కార్డు నెంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్‌ వంటి సంప్రదాయ ఫిజికల్‌ క్రెడిట్‌ కార్డ్‌ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే డిజిటల్‌ కార్డును ఐఫోన్‌ యూజర్లకు అందించనున్నామని ఈ ఏడాది మార్చిలోనే కంపెనీ ప్రకటించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్మాణ రంగంలోనూ జట్టు

10 శాతం పెరిగిన టైటాన్‌ లాభం

ఇక కశ్మీర్‌లో పెట్టుబడుల జోరు..

మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..

ఇక రిలయన్స్, బీపీ బంకులు

రిలయన్స్‌, బీపీ కీలక ఒప్పందం

కొత్త సెక్యూరిటీతో ‘ఐఫోన్లు’

వరుసగా నాలుగో రోజు నష్టాలే...

11 శాతం ఎగిసిన  టైటన్‌ లాభాలు 

ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్‌: గూగుల్‌

రేట్‌ కట్‌ అంచనా : లాభాల ముగింపు

భారీగా కోలుకున్న రూపాయి

కొనుగోళ్ల జోరు : 500 పాయింట్లు లాభం

ట్యాగ్‌ నుంచి పేటెంటెడ్‌ టెక్నాలజీ

రుణ రేట్ల సమీక్షకు బ్యాంకర్లు ఓకే

ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

ఇండియన్‌ బ్యాంక్‌ 75% వృద్ధి

రూ.8,600 వరకు తగ్గిన ఒకినావా స్కూటర్స్‌ ధర

కియా ‘సెల్టోస్‌’ విడుదల ఈ నెల 8న

‘అసలు అలా ఎందుకు జరగలేదు’

బేర్‌ ‘విశ్వ’రూపం!

కశ్మీర్‌ ఎఫెక్ట్‌ : మార్కెట్లు పతనం

200 కోట్లతో జీనోమ్‌ల్యాబ్స్‌ ప్లాంట్లు

మార్కెట్‌ దిశ ఎటు?

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!

బ్యాంకులకు వరుస సెలవులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో

ఆ వార్తపై రకుల్‌ ప్రీత్‌ అసహనం