క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌కు తగ్గిన ఉపసంహరణల ఒత్తిడి

4 May, 2020 06:16 IST|Sakshi

ఏప్రిల్‌ 30నాటికి 81 శాతం తగ్గుదల: యాంఫి

న్యూఢిల్లీ: క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌కు ఎట్టకేలకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిడి తగ్గింది. ఏప్రిల్‌ 27తో పోలిస్తే ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి నికర పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం 81 శాతం తగ్గిపోయినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ప్రకటించింది. యాంఫి వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్‌ 24న క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న మొత్తం రూ.2,949 కోట్లుగా ఉంటే, ఏప్రిల్‌ 27 నాటికి రూ.4,294 కోట్లకు పెరిగిపోయింది.

డెట్‌ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ ఏప్రిల్‌ 27న రూ.50,000 కోట్లతో మ్యూచువల్‌ ఫండ్స్‌కు ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించిన విషయం గమనార్హం. దీనివల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడిందో ఏమో కానీ... ఏప్రిల్‌ 28న రూ.1,847 కోట్లు, ఏప్రిల్‌ 29న రూ.1,251 కోట్లు, ఏప్రిల్‌ 30న రూ.794 కోట్లకు నికర పెట్టుబడుల ఉపసంహరణ తగ్గిపోయింది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ అన్నవి ఒక విభాగం. రిస్క్‌ అధికంగా ఉండే డెట్‌ పేపర్లలో అవి ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అంటే, తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న కంపెనీలు జారీ చేసే డెట్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటిల్లో డిఫాల్ట్‌ రిస్క్‌ అధికంగా ఉంటుంది. కనుకనే ఆయా కంపెనీలు అధిక రాబడులను ఆఫర్‌ చేస్తుంటాయి.

మరిన్ని వార్తలు