చైనాపై మరిన్ని ఆశలు

5 Apr, 2016 12:40 IST|Sakshi

దేశీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు అండగా ఉంటామని క్రెడిట్ స్యూజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిడ్జానే థియం ప్రకటించారు. ఆసియా దేశాల అభివృద్ధి కోసం స్విస్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంలో చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం భాగమన్నారు. చైనాలో క్రెడిట్ స్యూజ్ కు మంచి సభ్యులు ఉన్నప్పటికీ ఎందుకో అక్కడి ఆర్థిక పరిస్థితుల్ని మార్చలేకపోయామని అభిప్రాయపడ్డారు.  అభివృద్ధిలో భాగంగా సంపదను వెలికి తీయడమే లక్ష్యంగా వెల్త్ మేనేజర్లు పని చేయాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంపద సృష్టించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు.

ఐదు ఏళ్ల క్రితం 10 శాతంగా ఉన్న చైనా ఆర్థికవృద్ధి ఈ ఏడాది 6.5గా నిర్దేశించుకుందని, ఇది రెండు దశాబ్దాలకు తక్కువని చెప్పారు. 10 శాతం కంటే 6.5 శాతం తక్కువేమీ కాదని, యూరప్ దేశాల కంటే ఈ అభివృద్ధి ఎక్కువగానే ఉందని థియం పేర్కొన్నారు. ఐదు రోజుల చైనా పర్యటనలో భాగంగా పెట్టుబడుల అంశంపై స్యూజ్ కస్టమర్లను కలిసి థియం నిర్ణయం తీసుకోనున్నారు. చైనాలో సంపద సృష్టికి స్యూజ్ బ్యాంకు తప్పకుండా పెట్టుబడుల పెడుతుందని థియం చెప్పారు. 

మరిన్ని వార్తలు