కీలకమైన వ్యక్తిగత డేటా దేశం దాటిపోకూడదు: అమితాబ్‌ కాంత్‌

26 Feb, 2020 07:49 IST|Sakshi

న్యూఢిల్లీ: కీలకమైన ప్రజల వ్యక్తిగత డేటా కచ్చితంగా దేశీయంగానే నిల్వ చేయాలని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. ప్రయో ప్రయోజనాలకు అనుగుణంగా భారత ప్రజల డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలని వీసా, మాస్టర్‌ కార్డ్‌ తదితర అన్ని విదేశీ సంస్థలను కేంద్రం ఆదేశించగా, దీన్ని విదేశీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రజోపయోగం కోసం డేటాను పంచుకునేందుకు వీలుగా త్వరలోనే ఓ పబ్లిక్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కాంత్‌ తెలిపారు. దీనిపై నీతి ఆయోగ్‌ పనిచేస్తున్నట్టు ఫిక్కీ నిర్వహించిన అమెరికా–భారత్‌ ఫోరమ్‌ కార్యక్రమంలో భాగంగా చెప్పారు.

>
మరిన్ని వార్తలు