ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినవారు కోటీశ్వరులే!

23 May, 2017 15:20 IST|Sakshi
ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినవారు కోటీశ్వరులే!
న్యూఢిల్లీ : ప్రధానిగా నరేంద్రమోదీ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంస్కరణలు మార్కెట్లకు మంచి ఊపునిచ్చాయి. అంతేకాక ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భారీ విజయం, మార్కెట్లలో మంచి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటుచేశాయి. మరికొన్ని రోజుల్లో అమల్లోకి తీసుకురాబోతున్న జీఎస్టీ ఊపు కూడా మార్కెట్లకు మంచి జోష్ నిచ్చింది. దీంతో బీఎస్-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 40 లక్షల కోట్లకు పెరిగింది. వీటిలో మారుతీ సుజుకీ, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ర్యాలీ జరిపాయి. వీటితో పాటు ఎవరూ ఊహించని మరో స్టాక్ కూడా సంచలనాలు సృష్టించి, టాప్-10 బెస్ట్ ఫర్ ఫార్మెర్స్ జాబితాలో చేరింది. ఆ స్టాకే ల్యార్జ్ క్యాప్ లోని బజాజ్ ఫైనాన్స్ స్టాక్.
 
ఆ స్టాక్ లో మూడేళ్ల క్రితం 14.27 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేసిన వారు ప్రస్తుతం కోట్లాధిపతులు అయ్యారని తెలిసింది. గత మూడేళ్లు కాలంలో ఈ స్టాక్ మార్కెట్ విలువ పరంగా 538 శాతం పైకి ఎగిసిందని వెల్లడైంది. ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత మూడేళ్ల క్రితం 10వేల కోట్లగా ఉండగా.. శుక్రవారానికి ఇది 71,000 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. 2016 ఆర్థిక సంవత్సరం వరకు గత మూడేళ్ల కాలంలో కంపెనీ వార్షిక లాభాల వృద్ధి 29.31 శాతంగా రిపోర్టు చేసినట్టు క్యాపిటల్ డేటా వెల్లడించింది. ఈ కాలంలో వార్షికంగా అమ్మకాల వృద్ధి కూడా 33.64 శాతం పెరిగింది. దీంతో అనాలిస్టులు ఈ స్టాక్ పై మంచి అభిప్రాయాలను వెలువరుస్తున్నారు. టాప్ 10 బెస్ట్ ఫర్ ఫార్మర్స్ ఈ మూడేళ్ల కాలంలో బీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు 9 లక్షల కోట్లను యాడ్ చేశాయి. అయితే నేటి ట్రేడింగ్ లో మాత్రం ఈస్టాక్ 0.86 శాతం కిందకి ట్రేడవుతోంది. 
మరిన్ని వార్తలు