వడ్డీ రేట్లు ఇప్పటికింతే..

12 Dec, 2016 15:19 IST|Sakshi
వడ్డీ రేట్లు ఇప్పటికింతే..

డిపాజిట్లు వచ్చినా బ్యాంకులకు దక్కని ప్రయోజనం
సీఆర్‌ఆర్ పెంపే కారణం
బ్యాంకింగ్ వర్గాల విశ్లేషణ

 న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి పడుతున్నప్పటికీ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలేమీ కనిపించడం లేదు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను రిజర్వ్ బ్యాంక్ ఎకాయెకిన 100 శాతానికి పెంచేయడంతో  అదనపు నిల్వలపై బ్యాంకులకు రాబడి లేకపోవడమే ఇందుకు కారణమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నారుు. ’వడ్డీ రేట్ల కోత సంగతి అటుంచండి. రద్దు చేసిన రూ. 500/1,000 నోట్ల రూపంలో సేవింగ్‌‌స ఖాతాల్లోకి కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్న డిపాజిట్లపై 4 శాతం కనీస వడ్డీ రేటు చెల్లించేందుకు తగినన్ని వనరులను వెతుక్కుంటూ బ్యాంకులు నానా కష్టాలు పడుతున్నారుు’ అని సీనియర్ బ్యాంకర్ ఒకరు పేర్కొన్నారు.

మరోవైపు, పెట్టుబడులు తరలిపోయే విధంగా వడ్డీ రేట్లు నిర్దిష్ట స్థారుుకన్నా కిందికి పడిపోకుండా కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపారుు. ’గిట్టుబాటు కాక పెట్టుబడులు ఒక్కసారిగా అమెరికాకు ఎగిరిపోయేంతగా కూడా వడ్డీ రేట్లు తగ్గించలేం. ఈ విషయంలో సమతూకంతో వ్యవహరించాలి’ అని పేర్కొన్నారుు.

 నవంబర్ 27 నాటికి బ్యాంకుల్లోకి రూ. 8.11 లక్షల కోట్ల మేర డిపాజిట్లు వచ్చారుు. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మొదలైనవి ఇప్పటికే డిపాజిట్లపై రేట్లు తగ్గించడంతో రుణాలపైనా వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న అంచనాలు నెలకొన్నారుు. బ్యాంకులు తమకొచ్చిన లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లను తమ దగ్గర అట్టే పెట్టుకుంటే కుదరదని, వడ్డీ రేట్లు తగ్గించి రుణాలుగా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడం దీనికి మరింతగా ఊతమిచ్చింది. అరుుతే, అధిక మొత్తంలో డిపాజిట్లు వచ్చి పడినా ఆర్‌బీఐ ఒక్కసారిగా సీఆర్‌ఆర్ పెంచేయడంతో .. తక్కువ వ్యయాలతో నిధులు సమకూర్చుకున్న ప్రయోజనం బ్యాంకులకు లేకుండా పోరుుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.  దీంతో ఆర్‌బీఐ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ బ్యాంకులు వడ్డీ రేట్ల ప్రయోజనాలను బదలారుుంచకుండా ఆగే అవకాశం ఉందని వివరించింది.

 అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చేమోనన్న ఆందోళనలతో పాటు అనేక అంశాల ప్రభావంతో రూపారుు మారకం విలువపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒకవైపు అమెరికా ట్రెజరీ బిల్స్, బాండ్ రేట్లకు అనుగుణంగా వర్ధమాన మార్కెట్లలో బాండ్ ఈల్డ్‌లు (రాబడులు) పెరుగుతుండగా.. భారత్‌లో మాత్రం బాండ్ ఈల్డ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు తగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు