రుణాలపై వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో లేనట్టే: క్రిసిల్

12 Dec, 2016 15:24 IST|Sakshi
రుణాలపై వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో లేనట్టే: క్రిసిల్

ముంబై: ఆర్‌బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి)ను పెంచడం ద్వారా బ్యాంకుల్లో నమోదైన డిపాజిట్ల మొత్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడంతో... బ్యాంకుల నుంచి ఇప్పట్లో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్‌ను 100 శాతం పెంచిన ఆర్‌బీఐ... సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 11 మధ్యనున్న డిపాజిట్లలో నూరు శాతాన్ని పక్కన పెట్టాలంటూ బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకుల్లో ఉన్న 3 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకుకు వెళ్లనున్నారుు. ‘‘రిజర్వ్ బ్యాంకు తాజా చర్యతో తక్షణం ద్రవ్య చలామణి తగ్గిపోనుంది.

బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్ల కోతను ఆలస్యం చేయవచ్చు. సేవింగ్‌‌స ఖాతాల డిపాజిట్లపై బ్యాంకులు 4 శాతం వరకు వడ్డీకి హామీ ఇచ్చి ఉండగా... ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్ పెంచడం వల్ల రిజర్వ్ బ్యాంకుకు వెళ్లే డిపాజిట్లపై బ్యాంకులకు వాటిపై వచ్చే వడ్డీ ఏమీ ఉండదు’’ అని క్రిసిల్ తన నివేదికలో వివరించింది. నోట్ల రద్దు నిర్ణయంతో వృద్ధి రేటు తగ్గుతుందన్న అంచనాలు డిసెంబర్ 7న జరగనున్న మానిటరీ పాలసీ సమీక్షలో రెపో రేటుపై నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయని క్రిసిల్ తెలిపింది.

మరిన్ని వార్తలు