క్రిప్టోకరెన్సీ చట్టవిరుద్ధం: నాస్కామ్‌

26 Oct, 2018 00:45 IST|Sakshi

బెంగళూరు: బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీ వినియోగం చట్టవిరుద్ధమని, దేశీ చట్టాలను గౌరవించాల్సి ఉంటుందని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ప్రెసిడెంట్‌ దేబ్‌జాని ఘోష్‌ వ్యాఖ్యానించారు.

యూనోకాయిన్‌ పేరిట బెంగళూరులో తాజాగా దేశంలోనే తొలి బిట్‌కాయిన్‌ ఏటీఎం ఏర్పాటుకావడం.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాత్విక్‌ విశ్వనాథ్, సహ వ్యవస్థాపకుడు హరీశ్‌ బీవీలను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేయడంపై స్పందించిన ఆమె, క్రిప్టోకరెన్సీ ఉపయోగంలో ఉన్నటువంటి సానుకూల అంశాలను వివరించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి తప్పించి చట్టాల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు.   

మరిన్ని వార్తలు