సీఎస్‌బీ బ్యాంక్‌ లిస్టింగ్‌.. భేష్‌

5 Dec, 2019 05:55 IST|Sakshi

41 శాతం లాభంతో రూ.275 వద్ద లిస్టింగ్‌

54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగింపు

న్యూఢిల్లీ: సీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లోనూ, ముగింపులోనూ మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర రూ.195తో పోల్చితే లిస్టింగ్‌లో 41 శాతం లాభాన్ని, ముగింపులో 54 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. రూ.193–195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ బ్యాంక్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 87 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. బుధవారం సీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు బీఎస్‌ఈలో ఇష్యూ ధర, రూ.195తో పోల్చితే 41 శాతం లాభంతో రూ. 275 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 57 శాతం లాభంతో రూ. 307 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 40.2 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 3.7 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌రూ.5,205 కోట్లకు చేరింది. ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్‌ రూ.410 కోట్లు సమీకరించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు