ఎగుమతులకు మరింత జోష్‌..

2 Feb, 2019 00:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో వాటి పథకాలకు కేటాయింపులు మరింతగా పెంచింది కేంద్రం. 2019–20లో ఎగుమతి ప్రోత్సాహక స్కీములకు రూ.4,115 కోట్ల మేర కేటాయింపులను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2018–19లో ముందుగా రూ. 3,551 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత సవరించిన గణాంకాల ప్రకారం ఇది రూ. 3,681 కోట్లకు పెరిగింది.

ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌లో పెట్టుబడులు, జాతీయ ఎగుమతి బీమా ఖాతా, వడ్డీ రాయితీ స్కీమ్‌ మొదలైన వాటికి ఈ నిధులను కేటాయించారు. బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం వడ్డీ రాయితీ స్కీమ్‌లకు కేటాయింపులు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు పెరిగాయి. 2011–12 నుంచి ఎగుమతులు సుమారు 300 బిలియన్‌ డాలర్ల స్థాయిలోనే తిరుగాడుతున్నాయి. 2017–18లో స్వల్పంగా 10 శాతం పెరిగి 303 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

మరిన్ని వార్తలు