సైయంట్‌ చేతికి సెర్టన్‌ సాఫ్ట్‌వేర్‌

25 Jan, 2017 00:52 IST|Sakshi
సైయంట్‌ చేతికి సెర్టన్‌ సాఫ్ట్‌వేర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌ తాజాగా అమెరికాకు చెందిన ఇంజ నీరింగ్‌ సర్వీసుల కంపెనీ సెర్టన్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి 100% షేర్లను కొనుగోలు చేసేందుకు తమ అనుబంధ సంస్థ సైయంట్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ డీల్‌ విలువ ఎంతన్నది వెల్లడించలేదు. 2006లో ప్రారంభమైన సెర్టన్‌లో ప్రస్తుతం 45 మంది సిబ్బంది ఉన్నారు. ఆదాయం 6 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది.

దాదాపు 127 మిలియన్‌ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయని, ఇకపై కూడా అధిక వృద్ధి సాధన దిశగా ఉపయోగపడే కంపెనీలను కొనుగోలు చేయడం కొనసాగిస్తామని సైయంట్‌ తెలిపింది. గడిచిన రెండున్నరేళ్లలో సైయంట్‌ కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో ఇది అయిదోది. ఏవియోనిక్స్‌ విభాగంలో వృద్ధికి ఈ కొనుగోలు తోడ్పడగలదని సైయంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ పరమేశ్వరన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు