డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

20 Jul, 2019 09:13 IST|Sakshi

5వ తరం చేతికి కంపెనీ పగ్గాలు

డాబర్‌ ఛైర్మన్‌గా అమిత్‌బర్మన్‌ 

వైస్‌ చైర్మన్‌గా మోహిత్‌ బర్మన్‌

సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ డాబర్‌ ఇండియ చైర్మన్‌గా అమిత్ బర్మన్‌ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఆనంద్‌ బర్మన్‌ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ కొత్త నియామకం జరిగింది. మరో వారసుడు మోహిత్‌ బర్మన్‌ వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.  దీంతో రూ. 8500 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని కలిగిన దేశంలోని పురాతన వినియోగ వస్తువుల కంపెనీ పగ్గాలు తరువాతి తరం చేతుల్లోకి మారాయి. మరోవైపు సీఈవో పదవినుంచి తప్పుకున్న సునీల్ దుగ్గల్‌ శుక్రవారం బోర్డునకు కూడా రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో మోహిత్ మల్హోత్రాను సీఈవోగా నియమించింది 

వ్యవస్థాపక బర్మన్‌ కుటుంబంనుంచి  ఐదవతరం సభ్యుడైన అమిత్‌ బర‍్మన్‌(50) డాబర్‌లో అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈయన కంపెనీ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు.  డాబర్‌ ఫుడ్స్‌ పేరుతో సంస్థను స్థాపించిన అమిత్‌ 12 ఏళ్ల తరువాత దీన్ని మాతృసంస్థ డాబర్‌ ఇండియలో విలీనం చేశారు. వైస్‌ ఛైర్మన్‌గా నియమితులైన మోహిత్‌  ప్రస్తుతంఎలిఫెంట్ క్యాపిటల్(లండన్ స్టాక్ఎక్స్ఛేంజ్-లిస్టెడ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు, జీవిత బీమా, సాధారణ భీమా, ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్ స్పోర్ట్స్‌ సహా డాబర్ ఫ్యామిలీకి చెందిన పెట్టుబడులకు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అవివా లైఫ్ ఇన్సూరెన్స్, యూనివర్సల్ సైమన్ జనరల్ ఇన్సూరెన్స్, ఐపీఎల్‌ టీం కింగ్స్ఎలెవన్ పంజాబ్ తదితరాలున్నాయి. అలాగే ఆనంద్బర్మన్ కుమారుడు ఆదిత్య డాబర్ ఇండియాలో నాన్-ఎగ్జిక్యూటివ్ అడిషనల్‌ డైరెక్టర్‌గా కంపెనీలో చేరనున్నారు. 

కాగా సహజ ఉత్పత్తుల విక్రయం పేరుతో 1884లో డా.ఎస్.కె. బర్మన్ డాబర్‌ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం వాటికా షాంపూ, ఫెమ్ స్కిన్‌కేర్‌, రెడ్ టూత్ పేస్టు, ఓడోనిల్ ఎయిర్ ఫ్రెషనర్స్, రియల్ జ్యూస్,  హోం మేడ్‌  కుకింగ్‌ పేస్టులతో సహా అనేక ప్యాకేజీ బ్రాండ్లను  విక్రయిస్తున్నసంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు