పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా?

26 May, 2016 13:53 IST|Sakshi
పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా?

వాహనదారులకు మరోషాక్. ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిన ధరలతో  ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల్లో నమోదైన క్షీణతకు ఇక  చెల్లుచీటీ ఇచ్చినట్టేనని అంచనాలు చెబుతున్నాయి. డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ తగ్గడం, పెరిగిన డిమాండ్, ఉత్పత్తి తక్కువ కావడంతో ఇక వీటి ధరలు మోత  మోగనున్నాయని సమాచారం.  2014 డిసెంబర్ నెల స్థాయిని తాకాయట. తాజా ఆయిల్ ధరల నివేదిక ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ కు రూ.63.02లుగా ఉంటే, డీజిల్ లీటర్ కు రూ.51.67కు పెరిగిందట. అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయట. గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు స్మార్ట్ ర్యాలీ కొనసాగిస్తుండటంతో పాటు, ఏడు నెలల తర్వాత మొదటిసారి, బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్, బ్యారల్ ధర 50 డాలర్లకు పెరిగిందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

చాలాకాలంగా బేరిష్ మార్కెట్ గా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎనర్జీ రంగంలో మంచి అవుట్ లుక్ కనిపిస్తుండటంతో వీటి ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఉత్పత్తి పడిపోవడంతో పాటు డిమాండ్ పెరుగుతుండటం క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువ కావడానికి దోహదం చేస్తున్నాయని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు గోల్డ్ మ్యాన్ సాచే తెలిపింది. డిమాండ్ వైపు కాకుండా సప్లై వైపే ఎక్కువగా మార్పులు సంభవించడంతో, క్రూడ్ ధరల్లో ప్రభావం కనిపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జనవరిలో బ్యారల్ కు 30 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ప్రస్తుతం రికవరీ అయి 50 డాలర్లగా నమోదయ్యాయి.

రూపాయి విలువ పడిపోవడం కూడా దేశీయంగా క్రూడ్ ఆయిల్ ధరలపై ఒత్తిడిని నెలకొలేలా చేస్తుందని కేర్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం రూపాయి 68-69 మధ్య నడుస్తోంది. ఒకవేళ గ్లోబల్ గా క్రూడ్ ధరలు సాధారణంగా ఉన్నా.. ప్రభుత్వం వీటి ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. 2014 మేలో మోదీ ప్రభుత్వం పాలనలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీలు దాదాపు రెండింతలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై వేసే పన్నులతోనే మోదీ ప్రభుత్వం తమ రెవెన్యూలను పెంచుకుందని వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు