నోట్ల రద్దుతో వృద్ధికి కోత..!

19 Nov, 2016 00:19 IST|Sakshi
నోట్ల రద్దుతో వృద్ధికి కోత..!

కేర్, ఆంబిట్ క్యాపిటల్ నివేదికలు
2016-17లో 0.5% వరకూ వృద్ధి పడిపోతుంది: కేర్
వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు అంచనా
7.3 శాతం నుంచి 5.8 శాతానికి ఆంబిట్ కోత
దేశీయ డిమాండ్ పడిపోతుందని విశ్లేషణ

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పెను ప్రతికూల ప్రభావం చూపనుందని కేర్ రేటింగ్‌‌స, ఆర్థిక సేవల సంస్థ ఆంబిట్ క్యాపిటల్ శుక్రవారం విడుదల చేసిన తమ నివేదికల్లో తెలిపారుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) వృద్ధిరేటుపై ఈ ప్రభావం 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకూ ఉంటుందని కేర్ రేటింగ్‌‌స పేర్కొంది. పలు రంగాల్లో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని విశ్లేషించింది.  కాగా మోదీ ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశీయ డిమాండ్ గణనీయంగా పడిపోతుందని, దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) కేవలం 5.8 శాతం వృద్ధి మాత్రమే నమోదవుతుందని నివేదిక పేర్కొంది.

 చిన్న వ్యాపారాలకు పెను దెబ్బ: ఆంబిట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలోనే జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోయే అవకాశం ఉంది. మొదటి తొలి నెలల్లో 6.4 శాతం వృద్ధి నమోదరుుతే, ఇది ద్వితీయార్థంలో 0.50 శాతం తగ్గవచ్చు.

అక్టోబర్-డిసెంబర్ 2016 నుంచి 2019 అక్టోబర్-డిసెంబర్ మధ్య పన్ను చెల్లింపు రహిత వ్యాపారాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జీడీపీలో దాదాపు 40 శాతంగా ఉన్న ఈ వ్యాపారాలకు సంబంధించి దాదాపు సగం వ్యాపార పరిమాణాన్ని సంఘటిత రంగానికి అసంఘటిత రంగం కోల్పోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పరిణామం అంచనా కారణంగా 2017-18 వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నాం.

రియల్ ఎస్టేట్, తనఖా రహిత రుణాలు, రియల్టీ సేవలు, బిల్డింగ్ మెటీరియల్స్  వంటి నగదు ఆధారిత లావాదేవీలపై నోట్ల రద్దు సమీప కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

నగదు ఆధారిత లావాదేవీలపై అధికంగా వ్యాపారం చేసే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్‌‌స కంపెనీలపై (ఎన్‌బీఎఫ్‌సీ) సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.  

ఆయా రంగాలు స్వల్పకాలంలో తీవ్ర నష్టాలకు గురవుతారుు. వచ్చే రెండేళ్లలో చిన్న, అసంఘటిత రంగాలు పోటీతత్వాన్ని కోల్పోతారుు. తమ మార్కెట్ వాటాను పెద్ద సంస్థలకు కోల్పోతారుు.

2017 మార్చి నాటికి సెన్సెక్స్ 29,500 లక్ష్యంగా ఇంతక్రితం అంచనాల ఉపసంహరణ. 2018 మార్చి నాటికి సూచీ 29,000గా ఉంటుందని అంచనా. 

 ఆర్థిక వ్యవస్థ మందగించనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సరళతర ద్రవ్య,పరపతి విధానాన్ని అవలంభించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 25 నుంచి 50 బేసిస్ పారుుంట్ల మేర రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గించే వీలుంది.

పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవస్థలో డిమాండ్ తగ్గుతుందని ఇప్పటికే సిటీగ్రూప్,  కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, హెచ్‌ఎస్‌బీసీ  వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నారుు. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణం కట్టడికి, ఆర్‌బీఐ రెపో రేటు కోతకు దారితీస్తాయనీ ఆయా సంస్థలు విశ్లేషించారుు. మరోవైపు రేట్ల కోత, వృద్ధి ఊపుకు తాజా చొరవ దోహదపడుతుందని పారిశ్రామిక సంఘాలు విజ్ఞఫ్తి చేస్తున్నారుు.

సేవలు, తయారీలపై ప్రభావం: కేర్ రేటింగ్‌‌స
ఆర్థిక వ్యవస్థలో దాదాపు 70 శాతం వరకూ ఉన్న సేవలు, తయారీ రంగాలపై ఈ నిర్ణయ ప్రతికూల ప్రభావం ఉంటుంది. అరుుతే బ్యాంకింగ్‌కు ఇది సానుకూలాంశం. వ్యవసాయంపై కొంత తక్కువ ప్రభావం ఉండే వీలుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనా నోట్ల రద్దుకు ముందు 7.8 శాతం కాగా ఇప్పుడు దీనికి 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకూ తగ్గిస్తున్నాం. సేవల రంగంలో వాణిజ్యం, హోటల్స్, రవాణా వంటి రంగాలపై ప్రతికూలత చూపుతుంది. నగదు లావాదేవీలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండడం దీనికి ఒక కారణం. వచ్చే త్రైమాసికంలో కూడా ఈ రంగాల్లో రికవరీ అవకాశాలు ఉండకపోవచ్చు. అరుుతే తయారీ రంగం మాత్రం రెండు నెలలు ప్రతికూలత ఎదుర్కొనే వీలుంది. రియల్టీది కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతికూలతే.  బ్యాంకింగ్ విషయానికి వస్తే- డిపాజిట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు