ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు కిందికి!

17 Nov, 2016 00:56 IST|Sakshi
ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు కిందికి!

నోట్ల రద్దుపై సిటీ గ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ, కొటక్ అంచనా 

 న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో అదుపులో ఉంటుందని పలు ఆర్థిక సేవల దిగ్గజ సంస్థలు అంచనా వేస్తున్నారుు. ఈ నేపథ్యంలో  రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్ప కాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గే అవకాశం ఉందని సిటీగ్రూప్,  కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, హెచ్‌ఎస్‌బీసీ  సంస్థలు అభిప్రాయపడుతున్నారుు. డిసెంబర్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో  మూడు సంస్థల నివేదికలు... వాటి అంచనాలను చూస్తే...

 ద్రవ్యోల్బణం 4 శాతం లోపే..: సిటీ గ్రూప్ నవంబర్ - డిసెంబర్‌లో వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 4 శాతం దిగువనే ఉంటుంది. అరుుతే మార్చి నాటికి 4.5 శాతానికి చేరే వీలుంటుంది. ఈ నేపథ్యంలో పరపతి విధాన తదుపరి సరళీకరణ ఉండే వీలుంది. ‘‘డిసెంబర్‌లో రేటు కోత ఉంటుందన్న మా అంచనాలను కొనసాగిస్తున్నాం. అరుుతే ఇక్కడ ఆయా అంచనాలు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వంటి అంశాలపైనా ఆధారపడి ఉంటుంది. ద్రవ్యలభ్యత, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం’’అని సిటీగ్రూప్ నివేదిక తెలిపింది.

నోట్ల రద్దుతో డిమాండ్ డౌన్: కొటక్
పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలంలో వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు దోహదం చేసే అంశం. ఇది ద్రవ్యోల్బణం అదుపునకు, ఆర్‌బీఐ రేటు కోతకు దోహదపడే వీలుంది. డిసెంబర్‌లో 25 బేసిస్ పారుుంట్ల రెపో రేటు తగ్గే వీలుంది. డిమాండ్ భారీగా పడిపోతే రేటు కోత 50 బేసిస్ పారుుంట్ల వరకూ సైతం తగ్గవచ్చు. పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం రియల్టీ సంబంధిత రంగాలు, రిటైల్ వ్యాపారం, ఇతర వినియోగ వస్తువుల విభాగాలపై ఉండే అవకాశం ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం 5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది.

హెచ్‌ఎస్‌బీసీదీ అదే మాట
పెద్దనోట్ల రద్దు కారణంగా వ్యవస్థలో డిమాండ్ తగ్గుతుందని  హెచ్‌ఎస్‌బీసీ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రోపో రేటు పావుశాతం తగ్గే వీలుందని తెలిపింది ‘ మార్చి నాటికి ఆర్‌బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం. పెద్ద నోట్ల రద్దు, క్రూడ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో అదుపులో ఉండడం వంటి అంశాలు అటు టోకు ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశాలు. అరుుతే ఆయా అంశాలన్నీ అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల తీవ్రతపై ఆధారపడి ఉంటాయని కూడా నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు