నోట్ల రద్దుతో ప్రజల్లో మార్పు రాదు..

12 Dec, 2016 15:05 IST|Sakshi
నోట్ల రద్దుతో ప్రజల్లో మార్పు రాదు..

నోబెల్ గ్రహీత పాల్ క్రుగ్‌మన్ అభిప్రాయం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారీ స్థారుులో నష్టం కలిగించే చర్య అని నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు పాల్ క్రుగ్‌మన్ అన్నారు. ఇది ప్రజల ఆలోచనను మార్చలేదన్నారు. మనీ లాండరింగ్ విషయంలో మరింత జాగ్రత్త పడతారని, పక్కదారులు వెతుకుతారని, మరోసారి ఇలానే చేస్తే తమను తాము రక్షించుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆచరిస్తున్న విధానం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగించేదిగా పేర్కొన్నారు. క్రుగ్‌మన్ అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. డీమోనిటైజేషన్‌ను అసాధారణ చర్యగా పేర్కొన్నారు. రూ.2,000 నోటు విడుదల సరైంది కాదన్న ఆయన... నల్లధనాన్ని ఏరిపారేయడానికి ఇదొక ప్రయత్నమని చెప్పారు.

మరిన్ని వార్తలు