దేనా బ్యాంక్‌కు రూ.326 కోట్ల నష్టాలు

17 May, 2016 01:51 IST|Sakshi
దేనా బ్యాంక్‌కు రూ.326 కోట్ల నష్టాలు

ఎంపీఏలకు కేటాయింపులు 200% అప్
ముంబై: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.326 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు కేటాయింపులు 200 శాతంగా ఉండటంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని దేనా బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో  రూ.56 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్ సీఎండీ అశ్వని కుమార్ చెప్పారు. ఇక గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో తమ నికర నష్టాలు రూ.663 కోట్లని తెలిపారు.  

2014-15 క్యూ4లో రూ.366 కోట్లుగా ఉన్న మొండి బకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 200 శాతం వృద్ధితో రూ.1,094 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.265 కోట్ల నికర లాభం ఆర్జించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.935 కోట్ల నికర నష్టం వచ్చిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 2.22 శాతం నుంచి 2.12 శాతానికి తగ్గిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 5.45 శాతం నుంచి 9.98 శాతానికి, నికర మొండి బకాయిలు 3.82 శాతం నుంచి 6.35 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు