ఇండిగోకు మరో షాక్ ‌

12 Jul, 2019 19:39 IST|Sakshi

భద్రతా లోపాలపై డీజీసీఏ ఆగ్రహం

నలుగురు కీలక ఎగ్జిక్యూటివ్‌లకు షోకాజ్‌ నోటీసులు

ప్రధాని మోదీ జోక్యాన్ని కోరుతున్న గంగ్వాల్‌

సాక్షి, ముంబై: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ, ప్రమోటర్ల వివాదంతో చిక్కుల్లో పడిన ఇండిగోకు మరో షాక్‌ తగిలింది. ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) ఇండిగో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. డీజీసీఏ ప్రత్యేక ఆడిట్ బృందం భద్రతా లోపాలను గుర్తించిన నేపథ్యంలో నలుగురు సీనియర్‌ ఉద్యోగులకు శుక్రవారం నోటీసులిచ్చింది. ట్రైనింగ్‌ హెడ్‌ కెప్టెన్ సంజీవ్ భల్లా, చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ కెప్టెన్ హేమంత్ కుమార్, ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషీమ్ మిత్రా, క్యూఏ (క్వాలిటీ అస్యూరెన్స్) కెప్టెన్ రాకేశ్ శ్రీవాస్తవలకు ఈ నోటీసులిచ్చింది.

విమానాల ల్యాండింగ్‌ ప్రమాదాల సంఘటనల నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు , విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 8, 9తేదీల్లో గుర్గావ్‌లోని ఇండిగో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ప్రధాని జోక్యాన్ని కోరుతున్న గంగ్వాల్‌
మరోవైపు ఇండిగో ప్రమోటర్ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కో ప్రమోటర్‌ రాహుల్‌ భాటియా అక్రమాలపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే మార్కెట్‌ రెగ్యులేటరీకి లేఖ రాసిన ఇండిగో ప్రమోటర్‌ రాకేశ్‌ గంగ్వాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. సంస్థ ఎదుర్కొంటున్న కార్పొరేట్ పాలన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడాలని ప్రధానిని కోరినట్టు స​మాచారం. 

మరిన్ని వార్తలు