ధంతేరస్‌ :  కార్లపై భారీ డిస్కౌంట్లు

22 Oct, 2019 21:01 IST|Sakshi

సాక్షి, ముంబై: ధంతేరస్‌ సందర్భంగా కొత్త కారును కొందామని ప్లాన్‌ చేస్తున్నారా. లేదంటే ప్రస్తుత కారును మార్పిడి చేసి కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని యోచిస్తున్నారా? అయితే ఇది మంచి సమయం త్వరపడండి. ధనత్రయోదశి సందర్భంగా  ప్రముఖకార్ల కంపెనీలుపండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవటానికి, అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ  ఆఫర్లు అందిస్తున్నాయి.   హోండా, మారుతి సుజికి, టాటా మోటార్స్‌ తమ టాప్‌ మోడల్‌ కార్లపై  వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా డిస్కౌంట్‌ ఆఫర్లు, ఎక్స్‌టెండెడ్‌ వారంటీ, ఎక్స్జేంజ్‌ బోనస్‌తో పాటు భారీ  ఆఫర్లను అందిస్తోంది. 

హోండా ఆఫర్లు
హోండా అమేజ్‌, జాజ్‌, సిటీ  ఇలా  ఏడు మోడల్స్‌కార్లపై ధరలను తగ్గించింది.   రూ.9.78 లక్షల కారుపై 42వేల దాకా డిస్కౌంట్‌.రూ. 12వేల రూపాయల విలువైన ఎక్స్‌టెండెడ్‌ వారంటీ (4 వ & 5 వ సంవత్సరం). రూ .30,000 విలువైన కార్ల మార్పిడిపై అదనపు తగ్గింపు. రూ .16 వేల విలువైన హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (మూడేళ్లు) ఉచితం.

హోండా జాజ్‌లో రూ .25 వేల వరకు డిస్కౌంట్  రూ .25 వేల విలువైన కార్ ఎక్స్ఛేంజ్‌లో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. హోండా జాజ్ అసలు ధర రూ .9.41 లక్షలు.
హోండా సిటీ:  రూ. 32,000 ఆఫర్‌,  కార్ ఎక్స్ఛేంజ్‌ ద్వారా రూ .30,000 అదనపు తగ్గింపు.  అసలు ధరరూ .14.16 లక్షలు
హోండా బిఆర్-విలో, కంపెనీ మొత్తం 1,10,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది, ఇందులో నగదు తగ్గింపు (రూ .33,500), కార్ ఎక్స్ఛేంజ్ (రూ .50,000)  ఇతరాలు (రూ .26,500) ఉన్నాయి.
హోండా సివిక్ 250,000 రూపాయల వరకు తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత, కారు  కొత్త ధర 17.94 లక్షలు. ఈ కారు  అసలు ధర. రూ .22.35 లక్షల కారు. హోండా సివిక్ విత్ పెట్రోల్ ఇంజన్ (విసివిటి) రూ .200,000 వరకు నగదు తగ్గింపుతో లభిస్తుంది. హోండా సివిక్ (విఎక్స్ సివిటి, జెడ్ఎక్స్ సివిటి) మోడళ్లలో రూ .75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది.

మారుతి సుజుకి : మారుతి సుజుకి తన కార్లపై అధిక డిస్కౌంట్లను అందిస్తోంది. విటారా బ్రెజ్జా (డీజిల్) రూ .45,000 నగదు తగ్గింపు, 5 సంవత్సరాల వారంటీ రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ .10వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. మొత్తం  రూ .96,100 వరకు తగ్గింపు. మారుతి సుజుకి డిజైర్ (డీజిల్) : రూ .83,900 వరకు ఆఫర్‌ కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్ ,  కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి సుజుకి డిజైర్ (పెట్రోల్ వెర్షన్ అన్ని వేరియంట్లలో) 55,000 రూపాయల వరకు  ఆఫర్‌.

దీంతోపాటు చాలా సంవత్సరాలుగా కంపెనీ బెస్ట్ సెల్లర్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్, పెట్రోల్ వేరియంట్‌కు రూ .50 వేలు, డీజిల్ వేరియంట్‌కు రూ .77,600 వరకు, డీజిల్ వెర్షన్ కోసం కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీతో పాటు ఆఫర్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, ఆల్టో కె 10, సెలెరియోలపై వరుసగా రూ .60 వేలు రూ. 55వేలు, రూ .60వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి,  ఇందులో ఎక్స్ఛేంజ్ ,  కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.

టాటా మోటార్స్
కొత్త టాటా కారు కోసం తమ పాత కార్లను మార్పిడి చేసుకోవాలనుకునే వారికి డిస్కౌంట్లను అందిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం కంపెనీ నిర్దిష్ట పథకాలను ప్రారంభించింది.

టాటా హెక్సా  కొనుగోలుపై రూ .1.65 లక్షల వరకు ఆఫర్‌.
టాటా నెక్సాన్ రూ .87,000 వరకు తగ్గింపు
టాటా టియాగో ,  టాటా టియాగో ఎన్‌ఆర్‌జి రెండూ రూ .70 వేలదాకా  ఆఫర్స్‌ .
టాటా టైగర్‌పై 1.17 లక్షల రూపాయల తగ్గింపు 
టాటా హారియర్ 65,000 రూపాయల వరకు ఆఫర్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు