వేల్యూ ఫండ్స్‌ను కొనసాగించవచ్చా?

9 Dec, 2019 01:29 IST|Sakshi

నేను సీనియర్‌ సిటిజెన్‌ను. గత ఏడాది కాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో టాటా డిజిటల్‌ ఇండియా ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ టెక్నాలజీ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా టెక్నాలజీ ఫండ్, యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొనసాగించదగ్గ ఫండ్స్‌ ఏవి?
రవీందర్, కాకినాడ

మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మొత్తం ఐదు ఫండ్స్‌ల్లో నాలుగు ఫండ్స్‌ టెక్నాలజీ ఫండ్సే ఉన్నాయి. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందాలంటే పోర్ట్‌ఫోలియోలో ఒక టెక్నాలజీ ఫండ్‌ ఉంటే సరిపోతుంది. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో ఏకంగా నాలుగు టెక్నాలజీ ఫండ్స్‌ ఉన్నాయి. ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహం కాదు. ముఖ్యంగా మీలాంటి సీనియర్‌ సిటిజన్‌కు ఇది పూర్తిగా సరైనది కాదు. మీలాంటి వాళ్లకు నిలకడైన ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండాలి. దీని కోసం హైబ్రిడ్‌ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్‌ ఫండ్‌ను గానీ ఎంచుకోవాలి.

అయితే గత రెండేళ్లుగా టెక్నాలజీ/డిజిటల్‌ ఫండ్స్‌ మంచి రాబడులను ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇతర ఫండ్స్‌తో పోల్చితే టెక్నాలజీ ఫండ్సే మెరుగని అనిపిస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో ఇప్పుడు మీరు అదృష్టవంతులు. అలాగని ఎప్పుడూ ఇదే అదృష్టం కొనసాగుతుందని చెప్పలేం. అందుకని నాలుగు టెక్నాలజీ ఫండ్స్‌ను ఒకటికి తగ్గించుకోండి. యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ను కొనసాగించవచ్చు. మరో హైబ్రిడ్‌ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్‌ ఫండ్‌ను గానీ మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోండి.

నేను రిటైరవ్వడానికి మరో 13 ఏళ్ల సమయం ఉంది. రిటైర్మెంట్‌ అవసరాల కోసం కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో ఐదు మల్టీ–క్యాప్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా రెండు వేల్యూ ఫండ్స్‌–క్వాంటమ్‌ ఇండియా వేల్యూ ఫండ్, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు సంతృప్తికరంగా ఉన్నా, ఈ వేల్యూ ఫండ్స్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించవచ్చా ? –సుచిత్ర, హైదరాబాద్‌

మీరు రిటైరవ్వడానికి మరో 13  సంవత్సరాల సమయం ఉంది. అంటే మీరు మరో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయగలరు. కాబట్టి ఈ వేల్యూ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించవచ్చు. ఈ ఫండ్స్‌ పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉండొచ్చు కానీ మరీ తీసికట్టుగా ఏమీ లేదనే చెప్పవచ్చు. ఈ ఫండ్స్‌ల్లో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిస్తే, కనీసం రెండు మార్కెట్‌ సైకిల్స్‌ను ఈ ఫండ్స్‌ చూస్తాయి. ఈ కాలంలో ఈ ఫండ్స్‌ పనితీరు మెరుగు పడే అవకాశాలే చాలా అధికంగా ఉన్నాయి.

మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఫండ్స్‌ మరీ అంతగా నష్టపోకుండా ఉండటం, మీ పోర్ట్‌ఫోలియోకు ఒకింత స్థిరత్వం ఇచ్చి ఉండటం మీరు గమనించే ఉండాలి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌తో పాటు వేల్యూ ఫండ్స్‌ ఉండటం వల్ల మీ పోర్ట్‌ఫోలియో.. డైవర్సిఫికేషన్‌ పరంగా చూస్తే, మంచి స్థితిలోనే ఉందని చెప్పవచ్చు. ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్‌ పనితీరు ఒకింత నిరాశమయంగా ఉన్నప్పటికీ, 13 ఏళ్ల కాలంలో ఈ ఫండ్‌ పుంజుకొని మంచి రాబడులు ఇచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మరోవైపు ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియో పటిష్టంగానే ఉంది. నాణ్యత గల షేర్లే ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ వేల్యూ ఫండ్స్‌ల్లో మీ సిప్‌లను కొనసాగించండి.

సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి కదా ! వివిధ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఆ యా రంగాల్లోని రిస్క్‌లు ఆయా కంపెనీలపై బాగానే ప్రభావం చూపుతాయి కదా! అలాంటప్పుడు  ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదేనా ? అసలు ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు అసలు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి?
–జావేద్, విజయవాడ

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే ఒక ఫండ్‌ ఏ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిందనే విషయం ప్రధానాంశంగా ఫండ్స్‌కు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో ఒక ఫండ్‌ పనితీరు ఎలా ఉంది అనే విషయాన్నే పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు, అలాగే మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడూ సదరు ఫండ్‌ పనితీరు ఎలా ఉంది అనే విషయం కీలకం.

అలాగే సదరు ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఎలా ఉంది? దీర్ఘకాలం పాటు అతని పనితీరు సవ్యంగానే ఉందా ?అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా ఈక్విటీ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలు దాదాపు ఒకేలాగా ఉన్నప్పటికీ, వాటి రాబడుల్లో మాత్రం తేడా ఉండొచ్చు.  అందుకని ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు సదరు ఫండ్‌ పోర్ట్‌ఫోలియోనే కీలకంగా చూడకూడదు. ఆ ఫండ్‌ పనితీరును కూడా మదింపు చేయాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేరాలను గుర్తించేందుకు సెబీ వినూత్న వ్యూహాలు

ఈసారి 5 శాతంలోపే వృద్ధి

నవంబర్‌లో పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి

రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న హైన్స్‌

వచ్చే ఏడాదిలో సిట్రోయెన్‌ ‘సీ5 ఎయిర్‌క్రాస్‌’..!

భారత్‌లో వృద్ధి మాంద్యం..

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

ఇప్పటికీ జియోనే చౌక..

‘మందగమనానికి రాజన్‌ మందు’

ట్రేడింగ్‌లో అవకతవకలు.. ఐటీ దాడులు

భారత ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్‌

ఆ రంగాలు మరింత సంక్షోభంలోకి: రాజన్‌

లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయ్‌

గృహ విక్రయాల్లో 36 శాతం వృద్ధి

గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లోనే కొంటాం

ఇక పోస్ట్‌‘పాలసీ’ మ్యాన్‌లు!

నెఫ్ట్‌ లావాదేవీలు ఇక 24/7

నోకియా 2.3 ఆవిష్కరణ

విదేశీ పెట్టుబడుల వివరాలు ఏటా చెప్పాలి

భారత్‌లోకి హస్వానా ప్రీమియం బైక్స్‌

సౌదీ ఆరామ్‌కో విలువ... రూ.120 లక్షల కోట్లు

ఇక్కడ ఎస్‌యూవీలంటేనే ఇష్టం

12,000 దిగువకు నిఫ్టీ .

ప్రభుత్వం సాయం చేయాలి..లేదంటే మూతే!!

పీఎంసీ స్కాం, మరో బాధితుని కన్నుమూత

పెద్ద మొత్తంలో మారుతి కార్ల రీకాల్‌

గతంకంటే బలంగా బ్యాంకింగ్‌ రంగం

400 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు

ఇలాగైతే వొడాఫోన్‌ ఐడియా మూతే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహిళల స్వేచ్ఛ కోసం.. 

కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్‌ 

భయపెడతా 

సినీ చరిత్రను పరిరక్షించుకోవాలి 

శంకర్‌ తర్వాత మురుగదాస్‌ – రజనీకాంత్‌

ఈ మామకు ఇంకేం కావాలి – వెంకటేష్‌