ఐదేళ్ల తర్వాత డీజిల్ ధర తగ్గే అవకాశం!

30 Sep, 2014 16:58 IST|Sakshi
ఐదేళ్ల తర్వాత డీజిల్ ధర తగ్గే అవకాశం!
లీటర్ డీజిల్ ధర ఒక్క రూపాయి తగ్గింపు అంశాన్ని చమురు కంపెనీలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ డిజీల్ ధర తగ్గితే గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అవుతుందని బిజినెస్ అనలిస్టులు అంటున్నారు. 2009 జనవరి 29 తేదిన లీటర్ డిజీల్ ధర 1.75 తగ్గింది.  అంతర్జాతీయ దిగుమతి, రిటైల్ ధరకు ప్రస్తుత వ్యత్యాసం భారీగా ఉండటంతో చమురు ధరను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో దేశీయ చమురు కంపెనీలు డీజిల్ ధరను తగ్గించేందుకు ఈ సాయంత్రం ప్రభుత్వం, పరిశ్రమలు భేటి కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పరిస్థితులను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోడికి లేక రాశామని, అలాగే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో డీజిల్ ధర తగ్గింపుపై ఎన్నికల కమిషన్ కు తెలిపామని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 
 
మరిన్ని వార్తలు