2 లక్షల కోట్లకు దేశీ డిజిటల్ కామర్స్!

8 Jun, 2016 01:44 IST|Sakshi
2 లక్షల కోట్లకు దేశీ డిజిటల్ కామర్స్!

న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ కామర్స్ పరిశ్రమ మంచి ఊపుమీదుంది. ఈ-కామర్స్ రంగపు బలమైన వృద్ధి నేపథ్యంలో గతేడాది డిసెంబర్ నాటికి రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ ఈ ఏడాది చివరకు 68 శాతం వృద్ధితో రూ.2.1 లక్షల కోట్లకు చేరొచ్చని ఐఏఎంఏఐ-ఐఎంఆర్‌బీ నివేదిక పేర్కొంటోంది. ఇందులో ఆన్‌లైన్ ట్రావెల్ వాటా 1.2 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా వేసింది. నివేదిక ప్రకారం..

గతేడాది చివరి నాటికి... డిజిటల్ కామర్స్‌లో ఆన్‌లైన్ ట్రావెల్ వాటా 61 శాతంగా (రూ.76,396 కోట్లు) ఉంది. ఇక నాన్ ట్రావెల్ (ఈ-టెయిలింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి) వాటా రూ.49,336 కోట్లుగా నమోదయ్యింది.

2014 డిసెంబర్ నాటికి రూ.1,965 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్ హోటల్ బుకింగ్స్ 2015 అదే నెలకు వచ్చేసరికి 165 శాతం వృద్ధితో రూ.5,200 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్స్ కూడా 34 శాతం వృద్ధితో రూ.16,200 కోట్ల నుంచి రూ.21,708 కోట్లకు ఎగశాయి. ఇక ఈ-టెయిలింగ్‌లో 57 శాతం వృద్ధి నమోదయ్యింది.

ట్రాన్సాక్షన్స్ ప్రకారం చూస్తే.. ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ 2015 చివరి నాటికి రూ.5,231 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆన్‌లైన్ మూవీ టికెట్స్, గ్రోసరీ, ఫుడ్ డెలివరీ వాటి మార్కెట్ రూ.3,823 కోట్లుగా నమోదయ్యింది.

మరిన్ని వార్తలు