డిష్‌ టీవీ లాభాల దౌడు

13 Jun, 2018 14:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  డైరెక్ట్-టు-హోమ్ టెలివిజన్ ఆపరేటర్ డిష్‌ టీవీ దూసుకుపోతోంది.  బుధవారం మధ్యాహ్నం ఉదయం 5 శాతానికిపై గా పుంజుకుని కొత్త గరిష్టాలను తాకింది. ఐదు బ్లాక్‌డీల్స్‌ ద్వారా 2.2 శాతం వాటాకు సమానమైన 3.95 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డిష్‌ టీవీ తాజాగా వెల్లడించింది.  దీంతో స్టాక్ డిష్ టీవీ టాప్‌ విన్నర్‌గా నిలిచింది.

బ్లాక్‌డీల్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారిన వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అయితే అనంతరం  లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. బుధవారం ప్రారంభ సమావేశంలో బిఎస్ఇ, ఎన్ఎస్ఇ రెండింటిపై డిష్ టీవీ షేర్లలో వరుస బ్లాక్ డీల్స్ కూడా కనిపించాయి. దీంతో  డిష్ టీవీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ .680 కోట్లు పెరిగింది.  ఇవాల్టి లాభాలతో  రూ .14,058 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను డిష్‌ టీవీ సాధించింది.

కాగా గతనెలలో విడుదల చేసిన మార్చి త్రైమాసికంలో రూ.118.21 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాలను సాధించింది. అందుకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 29.49 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది.

మరిన్ని వార్తలు