అంచనాలు అందుకోని టీసీఎస్‌

10 Oct, 2019 20:13 IST|Sakshi

బెంగళూర్‌ : భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సెప్టెంబర్‌తో 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. రెండో త్రైమాసికంలో కంపెనీ అంచనాల కంటే తక్కువగా ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. షేర్‌కు 45 రూపాయల ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే కంపెనీ రాబడి 5.8 శాతం మేర పెరిగి రూ 38,977 కోట్లు ఆర్జించింది. ఏకీకృత నికర లాభం 1.8 శాతం వృద్ధితో రూ 8042 కోట్లుగా నమోదైంది. ఈపీఎస్‌ 3.8 శాతం పెరుగుదలతో రూ 21.43గా నమోదైంది.

ఇక ఆర్థిక సేవలు, రిటైల్‌ విభాగాల్లో అనిశ్చితి నెలకొన్నా మెరుగైన ఫలితాలు ప్రకటించామని క్యూ టూ ఫలితాలపై కంపెనీ సీఈవో రాజేష్‌ గోపీనాథన్‌ పేర్కొన్నారు. గత ఆరు క్వార్టర్లలో కంటే అత్యధికంగా రెండో త్రైమాసికంలో ఆర్డర్లు మెరుగ్గా ఉన్నాయని ఇదే వృద్ధి పరంపరను మున్ముందు కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు