దివీస్‌ షేర్‌కు మరోసారి నష్టాలు

27 Sep, 2017 12:53 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ ఫార్మ దిగ్గజం దివీస్‌ లాబ్స్‌కు మరోసారి  చిక్కులు తప్పలేదు. యూఎస్‌ఎఫ్‌డీఏ తాజా అబ్జరేషన్స్‌ నేపథ‍్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో దివీస్‌ లేబ్స్‌ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది.

ఈ నెలలో తనిఖీలు నిర్వహించిన  తనిఖీల్లో ఆరు లోపాలను(అబ్జర్వేషన్స్‌) నమోదు చేసినట్లు వెల్లడికావడంతో   దివీస్‌ షేర్‌  9   శాతానికిపైగా నష్టపోయింది.   మార్చి 21 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రా డే పతనాన్నినమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో గత 12నెలల్లో 28 శాతం  పడిపోయింది.

 వైజాగ్‌లోని యూనిట్‌-2లో యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్వహించిన తుది ఏపీఐల ఇండివిడ్యుయల్‌ పరీక్షలలో దివీస్‌ విఫలమైనట్లు తెలుస్తోంది. తయారీ, పరికరాల పరిశుభ్రత వంటి అంశాలలోనూ లోపాలు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి.  అయితే తాజా నివేదికలపై  దివీస్‌ ఇంకా స్పందించలేదు.
 కాగా  అమెరికా రెగ్యులేటరీ నుంచి  ఆరు అబ్జర్వేషన్స్‌ తమకు అందాయని దివీస్‌  గతవారం  తెలిపింది.  ఇది సాధారణమేనని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు