అదరగొట్టిన డీమార్ట్‌,  మార్కెట్‌ క్యాప్‌ జూమ్‌

10 Feb, 2020 17:06 IST|Sakshi

సాక్షి, ముంబై:  ముంబైకి చెందిన డీమార్ట్ సూపర్‌‌‌‌మార్కెట్ చెయిన్‌‌ అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ షేరు మరోసారి అదరగొట్టింది. సోమవారం నాటి  నష్టాల మార్కెట్లో కూడా 11శాతం ఎగిసి రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. లిస్టింగ్‌ ధర నుంచి ఏకంగా  నాలుగు రెట్లు ఎగిసింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.55 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా డీమార్ట్‌ బీఎస్ఇలో 18 వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.  తద్వారా మార్కెట్‌ క్యాప్‌ పరంగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌,  నెస్లే లను అధిగమించింది 

కాగా గత వారం, అవెన్యూ సూపర్మార్ట్స్, 4,098 కోట్ల వరకు సేకరణకుగాను అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్‌మెంట్ (క్యూఐపి)ప్రారంభించింది. ఈ క్యూఐపీ ద్వారా  20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 1,999.04 చొప్పున విక్రయిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ క్యూఐపి ద్వారా  20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి రూజ1,999.04 చొప్పున విక్రయిస్తామని  తెలిపింది. ఈ నిధులను  తన స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, సరఫరా గొలుసులో పెట్టుబడులు పెట్టడానికి,  రుణాలు తిరిగి చెల్లించడానికి వినియోగించనుంది. 

కాగా 2002 లో ముంబైలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించగా, డిసెంబర్ 31, 2019 నాటికి కంపెనీకి 196 దుకాణాలు  డిమార్ట్‌ సొంతం. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ ఆదాయం రూ. 6,809 కోట్లుగా ఉంది, రూ. గతేడాది ఇదే కాలంలో 5,474 కోట్లు. నికర లాభం రూ. 384 కోట్ల నికర లాభాలను సాధించింది. 

మరిన్ని వార్తలు