ఎయిరిండియాకు బిడ్‌ వేయడం లేదు: ఇండిగో 

6 Apr, 2018 01:28 IST|Sakshi

ఎయిరిండియా అంతర్జాతీయ కార్యకలాపాలు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని ముందునుంచీ చెబుతున్నాం. అయితే, ప్రభుత్వం ప్రకటించిన డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలో అలాంటి ఆప్షన్‌ లేదు. పూర్తి కంపెనీని కొనుగోలు చేసి, దాన్ని విజయవంతంగా టర్నెరౌండ్‌ చేసే సామర్ధ్యం మాకు ఉందని భావించడం లేదు. గతంలోనూ ఇదే చెప్పాం’ అని ఇండిగో ప్రెసిడెంట్‌  ఘోష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

న్యూఢిల్లీ: ఎయిరిండియా కొనుగోలు రేసులో తాము లేమని చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. తాము ప్రధా నంగా ఎయిరిండియా అంతర్జాతీయ కార్యకలాపాలు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను కొను గోలు చేయాలని భావించామని.. అయితే, డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలో అలాంటి అవకాశాలు లేవని  పేర్కొంది. రుణభారం పేరుకుపోయిన ఎయిరిండియా కొనుగోలుపై మిగతా అన్ని సంస్థల కన్నా ముందుగా ఇండిగోనే ఆసక్తి వ్యక్తం చేసింది.కానీ తాజాగా ఎయిరిం డియా విక్రయం విధివిధానాలు పరిశీలించిన మీదట తాజా నిర్ణయం తీసుకుంది.  వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక కింద ఎయిరిండియాలో 76 శాతం వాటాల విక్రయంతో పాటు యాజమాన్య హక్కులను కూడా కొనుగోలుదారుకు బదలాయించాలని కేంద్రం   యోచిస్తోంది.  

మరిన్ని వార్తలు