భారత్‌ ఇంకా వర్ధమాన దేశమేమీ కాదు..

15 Aug, 2019 06:53 IST|Sakshi

ఇకపై అక్రమంగా ప్రయోజనాలు తీసుకోనిచ్చేది లేదు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ఇతర దేశాలపై విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరోసారి భారత్, చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ’వర్ధమాన దేశాల’ హోదా ముసుగులో భారత్, చైనా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటివి సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. భారత్, చైనాలు ఆసియాలో ప్రస్తుతం ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగాయని.. అవి ఇంకా వర్ధమాన దేశాలేమీ కాదని పేర్కొన్నారు. కానీ వర్ధమాన దేశాలనే హోదాను అడ్డం పెట్టుకుని అమెరికా నుంచి ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాయన్నారు. ‘డబ్ల్యూటీవో ఇప్పటికీ కొన్ని దేశాలను ఇంకా ఎదుగుతున్న దేశాలుగానే చూస్తోంది. కానీ వాస్తవానికి అవి ఎప్పుడో ఎదిగేశాయి. అన్ని దేశాలూ ఎదుగుతున్నాయి.. ఒక్క అమెరికా తప్ప. ఇకపై మాత్రం అలాంటి దేశాలు అక్రమంగా వర్ధమాన దేశాల హోదాను వాడుకుని అక్రమంగా ప్రయోజనాలు పొందనిచ్చేది లేదు‘ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు