భారతీయ వర్కర్లకు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌

26 Jan, 2018 17:32 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దేశీయ ఐటీ వర్కర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. వీసా లాటరీ సిస్టమ్‌కు స్వస్తి పలకాలని ట్రంప్‌ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో కొన్ని దశాబ్దాలుగా గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీగా లబ్ది చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నైపుణ్యవంతులైన వర్కర్లకు ఎంతో మేలు చేయనుందని రిపోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ ఈ బిల్లును కాంగ్రెస్‌ ఆమోదిస్తే, అత్యధిక నైపుణ్యం కలిగిన భారత వలసదారులకు గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ను గణనీయంగా తగ్గనుంది. 

'ది డైవర్సిటీ వీసా ప్రొగ్రామ్‌' కింద ఏడాదికి 50వేల మందికి గ్రీన్‌కార్డులను అందిస్తున్నారు. ఈ గ్రీన్‌కార్డు పొందిన వారికి అమెరికాలో శాశ్వత నివాస హోదా లభించనుంది. భౌగోళికపరంగా ఈ వీసాలను అందజేస్తారు. ప్రస్తుతం దేశీయ కోటా కింద వేలమంది భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్‌కార్డుల కోసం కొన్ని దశాబ్దాలుగా వేచిచూస్తున్నారు. 'ది డైవర్సిటీ వీసా ప్రొగ్రామ్' ప్రొగ్రామ్‌ను ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. దీంతో అమెరికాకు ఉత్తమమైన, ప్రతితాభవంతులైన వర్కర్లు రాలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత రోజుల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో నిందితులు డైవర్సిటీ వీసా లేదా చైనా మైగ్రేషన్‌గా గుర్తించారు. 

మరిన్ని వార్తలు