సిప్‌ రెట్టింపు చేసుకోండి!

29 May, 2020 15:18 IST|Sakshi

ప్రశాంత్‌ జైన్‌ సలహా

ప్రస్తుత ఎకానమీ లేదా మార్కెట్‌ ప్రదర్శనను చూసి ఒక అంచనాకు రావద్దని, ప్రస్తుత వెనుకంజ నిజానికి పెట్టుబడులకు సరైన అవకాశమని ప్రముఖ అనలిస్టు ప్రశాంత్‌ జైన్‌ సూచిస్తున్నారు. 2020-21ని మర్చిపోయి తర్వాత సంవత్సరాలను మదింపు చేసుకోవాలన్నారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సిప్‌ పెట్టుబడులు డబుల్‌ చేసుకోవడం ద్వారా మంచి ఆర్జన చూడొచ్చన్నారు. కరోనా సంక్షోభం కారణంగా జీడీపీ కుంచించుకుపోవడం సహజమేనని చెప్పారు. ఈ ఇబ్బంది కారణంగా కార్పొరేట్‌ లాభదాయకత బాగా దెబ్బతింటుందన్నారు. అయితే ఇదంతా సంక్షోభానంతరం కుదుటపడుతుందని, నిజానికి వర్ధమాన మార్కెట్లన్నింటిలో భారత్‌ది భిన్నగాధని చెప్పారు. శుక్రవారం దేశీయ జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ దఫా సహజంగానే జీడీపీ బాగా మందగించిఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సహా పలు బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. అయితే కరోనా కారణంగా ఎగుమతులు, దిగుమతులు క్షీణించి తొలిసారి 10-12 సంవత్సరాల తర్వాత చెల్లింపుల శేషం(బాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) పాజిటివ్‌గా ఉంటుందని జైన్‌ అంచనా వేశారు. రాబోయే రోజుల్లో వడ్డీరేట్లు మరింత దిగివస్తాయన్నారు. 2021-22లో తిరిగి ఇండియా రెండంకెల వృద్ది సాధిస్తుదని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్లో వినిమయ రంగ స్టాకులపై పాజిటివ్‌గా లేనని, లాక్‌డౌన్‌ కారణంగా వినిమయం తగ్గిందని, ఈ నేపథ్యంలో వినిమయ స్టాకుల వాల్యూషన్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఆస్తుల నాణ్యత పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుంటే తిరిగి బ్యాంకింగ్‌ రంగం పుంజుకుంటుందన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు