డీపీ వరల్డ్‌ గ్రూప్‌ వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు

12 Jan, 2017 01:03 IST|Sakshi
డీపీ వరల్డ్‌ గ్రూప్‌ వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: డీపీ వరల్డ్‌ గ్రూప్‌ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. పోర్ట్, లాజిస్టిక్స్‌ రంగంలో దశలవారీగా వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని డీపీ వరల్డ్‌ గ్రూప్‌ చైర్మన్, సీఈఓ సుల్తాన్‌  అహ్మద్‌  బిన్‌ సులాయేమ్‌ పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే 120 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టామని, భారత కంటైనర్‌  వ్యాపారంలో 30 శాతం వ్యాపారానికి తోడ్పాటునందిస్తున్నామని వివరించారు. వృద్ధి చెందుతున్న దేశాల్లో బలమైన దేశాల్లో ఒకటైన భారత్‌లో నౌకా వ్యాపారంలో భారీగా అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమిట్‌ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని సుల్తాన్‌ అహ్మద్‌  బిన్‌  అహ్మదాబాద్‌లో కలిశారని డీపీ వరల్డ్‌ గ్రూప్‌ పేర్కొంది. భారత్‌లో 5 అంతర్జాతీయ గేట్‌వే పోర్ట్స్‌ అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టామని వివరించింది.

మరిన్ని వార్తలు