ప్యాకేజింగ్ ప్రమాణాల్ని పాటించాం: డాక్టర్ రెడ్డీస్

10 Jun, 2016 01:21 IST|Sakshi
ప్యాకేజింగ్ ప్రమాణాల్ని పాటించాం: డాక్టర్ రెడ్డీస్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాలో తమ ఔషధ ప్యాకేజింగ్ వివాదంపై ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్(డీఆర్‌ఎల్) స్పందించింది. ప్యాకేజింగ్ విషయంలో తాము అన్ని ప్రమాణాలనూ పాటించామని, దీనిపై విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలకూ పూర్తి సహకారం అందించామని తెలిపింది. 2002-2011 మధ్య కాలంలో పిల్లలకు అంతగా సురక్షితం కాని ప్యాక్‌లలో డీఆర్‌ఎల్ ఔషధాలను విక్రయించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై విచారణ తదితర అంశాల గురించి డీఆర్‌ఎల్ గతంలోనే  మార్కెట్ నియంత్రణ సంస్థలకు తెలిపింది. అయిదేళ్ల క్రితం నాటి ఈ కేసుకు సంబంధించి డీఆర్‌ఎల్‌పై చర్యలు తీసుకోవాలంటూ అమెరికా వినియోగదారుల కమిషన్ (యూఎస్‌సీపీఎస్‌సీ) తాజాగా అక్కడి న్యాయశాఖను ఆశ్ర యించడంతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వార్తల దరిమిలా గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.95 శాతం క్షీణించి రూ. 3,071.45 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు