డాక్టర్ రెడ్డీస్ చేతికి ఆరు బ్రాండ్లు

26 May, 2016 02:08 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్ చేతికి ఆరు బ్రాండ్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా డుసెర్ ఫార్మా నుంచి 6 ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) బ్రాండ్స్‌ను కొనుగోలు చేసింది. తద్వారా అమెరికాలో బ్రాండెడ్ కన్జూమర్ హెల్త్ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించినట్లయిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. అమెరికాలో తమ ఓటీసీ వ్యాపార విభాగం వృద్ధికి ఇవి తోడ్పడతాయని ఆయన చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేసిన వాటిలో డోయాన్స్, బఫెరిన్, న్యూపర్ కైనాల్ ఆయింట్‌మెంట్, క్రూయెక్స్ నెయిల్ జెల్, కామ్‌ట్రెక్స్, మయోఫ్లెక్స్ ఉన్నాయి. ప్రధానంగా దగ్గు, జలుబు, చర్మ సమస్యలు మొదలైన వాటి చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు.

ఈ బ్రాండ్స్ కొనుగోలుకు ఎంత వెచ్చించారనేది కంపెనీ వెల్లడించలేదు. బుధవారం బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు 0.92 శాతం పెరిగి రూ. 3,053 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు