డాక్టర్ రెడ్డీస్ లోగో మారింది

2 Jul, 2015 00:32 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్ లోగో మారింది

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ న్యూ బ్రాండింగ్‌పై దృష్టిసారించింది. ఇందులో భాగంగా  ‘గుడ్‌హెల్త్ కెన్ నాట్ వెయిట్’ అనే ఉప శీర్షికతో నూతన లోగోను ఆవిష్కరించింది. ఈ న్యూ బ్రాండింగ్ కార్యక్రమాన్ని రెండు దశల్లో చేపడుతున్నామని, తొలి దశ కింద కార్పొరేట్ బ్రాండింగ్‌ను మారుస్తున్నామని, 2వ దశలో ప్రోడక్టులపై లోగోలను మార్చనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.   నూతన ఆవిష్కరణ, వివేకానికి ప్రతీకగా ఉదారంగును ఎంచుకున్నట్లు  డాక్టర్ రెడ్డీస్ కో చైర్మన్, సీఈవో జి.వి.ప్రసాద్ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు