దూసుకొచ్చిన ‘డుకాటీ డయావెల్‌ 1260’ 

10 Aug, 2019 09:44 IST|Sakshi

ప్రారంభ ధర రూ.17.7 లక్షలు 

న్యూఢిల్లీ: ఇటాలియన్‌ సూపర్‌ బైక్స్‌ తయారీ దిగ్గజం డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త ‘డయావెల్‌ 1260’ బైక్‌ను శుక్రవారం ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ ధర రూ.17.7 లక్షలు కాగా, ఇదే మోడల్‌లో అధునాతన స్పోర్ట్స్‌ బైక్‌ను కంపెనీ విడుదలచేసింది. ‘డయావెల్‌ 1260 ఎస్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చిన నూతన స్పోర్ట్స్‌ వేరియంట్‌ ధరను రూ.19.25 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఇందులో 1262 సీసీ ఇంజిన్‌ను అమర్చించి. ఈ సందర్భంగా డుకాటీ ఇండియా ఎండీ సెర్గీ కెనోవాస్‌ మాట్లాడుతూ.. ‘క్రూయిజర్‌ను ఇష్టపడే వాళ్లలో అధిక శాతం వినియోగదారులు డయావెల్‌ మోడల్‌ను ఇష్టపడతారు. నూతన 1260 బైక్‌కు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా