డుకాటీ సూపర్‌ స్పోర్ట్స్‌ బైక్స్‌

24 Sep, 2017 00:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సూపర్‌ లగ్జరీ బైక్‌ మేకర్‌  డుకాటీ  సరికొత్త  సూపర్‌ స్పోర్ట్స్‌  బైక్‌లను  భారత మార్కెట్‌లో శుక‍్రవారం లాంచ్‌ చేసింది.  సూపర్‌ స్పోర్ట్‌, సూపర్‌ స్పోర్ట్‌ ఎస్‌ పేరుతో రెండు వేరియంట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధర రూ. 12.08 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించింది.  

సూపర్ స్పోర్ట్  బేస్ వెర్షన్ రూ.12.08 లక్షలు గాను, సూపర్ స్పోర్ట్ ఎస్ ధర రూ. 13.39 లక్షలు, తెల్ల రంగు కోసం రూ.13.6 లక్షలుగా ప్రకటించింది. పవర్‌ ఫుల్‌ టెస్టా ట్రెట్టా 11 లీటర్ల ట్విన్‌ ఇంజీన్‌తో వీటిని లాంచ్‌ చేసింది. 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, ఆల్‌-డిజిటల్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 8 లెవల్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టం, 110పీస్‌, 93ఎన్‌ఎం పీక్ టార్క్  ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  

 కాగా డుకాటీ సూపర్‌ స్పోర్ట్‌ బైక్స్‌ భారతీయ టూవీలర్‌ మార్కెట్‌ లో కవాసాకీ నింజా 1000, సుజుకి జీఎస్‌ఎక్స్‌-S1000F లాంటి ఇతర సూపర్‌ బైక్‌లను గట్టి పోటీ ఇస్తుందని అంచనా.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు