డుకాటి.. ‘ఎక్స్డీవెల్’ క్రూజర్

16 Sep, 2016 00:53 IST|Sakshi
డుకాటి.. ‘ఎక్స్డీవెల్’ క్రూజర్

ధర రూ.15.87 లక్షలు

 న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ‘డుకాటి’ తాజాగా తన క్రూజర్ బైక్ ‘ఎక్స్‌డీవెల్’ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.15.87 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ‘క్రూజర్ అనేది భారత్‌లో అతిపెద్ద లగ్జరీ మోటర్‌సైకిల్ విభాగం. మేం సరికొత్త ప్రొడక్ట్‌తో ఇందులోకి అడుగుపెడుతున్నాం’ అని డుకాటి ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ రవి ఆవలూరు తెలిపారు. డిజైన్, స్టైల్, ఇంజిన్ వంటి అంశాలు ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయని పేర్కొన్నారు. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్, డీవీటీ 1262 ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. ఇక ఎక్స్‌డీవెల్ ఎస్ వేరియంట్ ధర రూ.18.47 లక్షలుగా ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు